ys jagan speech at hussenapur

పోలీసులు నిజాయితీగా విధులు నిర్వ‌హించాలి. గుంట న‌క్క‌ల‌కు సెల్యూట్ చేయొద్దు. 'మూడు సింహాల'కు లోబ‌డి ప‌ని చేయాలి. మ‌హిళా స‌ద‌స్సుకు వ‌చ్చే వారిని పోలీసులు అడ్డగించార‌ని తెలిసింది. నేను ప్ర‌తిప‌క్ష నేత‌ను ... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు పాద‌యాత్ర చేస్తున్నా. త‌మ బాద‌ల‌ను వెలిబుచ్చేందుకు ఎంద‌రో వ‌స్తుంటారు. వారిని పోలీసులు అడ్డ‌గించ‌డం  దేనికి? మ‌హిళ‌ల‌ను అడ్డ‌గించ‌డం దారుణం. పోలీసుల‌కు ఒక‌టే చెబుతున్నా. మీరు మీ విధుల‌ను నియ‌మ నిబంద‌న‌ల మేర‌కు నిర్వ‌హించండి. మూడు సింహాల‌కు లోబ‌డి ప‌ని చేయండి. అంతేకానీ గుంట న‌క్క‌ల‌కు బెదిరి సెల్యూట్ చేయొద్దు. చంద్ర‌బాబు స‌ర్కారు ఎల్ల కాలం ఉండ‌దు. ఆయ‌న‌కు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం మీకు లేదు. ఈ విష‌యాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలి. నిజాయితీగా విధుల‌ను నిర్వ‌హించాల‌ని కోరుతున్నా.