తమ గోడు వెళ్ల‌బోసుకున్న మెడికల్ విద్యార్ధులు, ఆదుకోవాలంటూ విజ్ఙప్తి..
ఫాతిమా వైద్య విద్యార్ధుల విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన జగన్.. 

వైయస్ జగన్ వ్యాఖ్యలు--

చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్ధుల చదువులు అగిపోయాయి. విద్యార్ధుల సమస్యలను ప్రభుత్వం అస్స‌లు పట్టించుకోలేదు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో  ఫాతిమా కాలేజీ అంశాన్ని చంద్రబాబు వాడుకున్నారు. విద్యార్ధులకు సిట్లు ఇచ్చినట్లు ప్రచారం కూడా చేశారు. మెడికల్ విద్యార్ధుల విషయంలో బాబు మోసానికి పాల్ప‌డ్డాడు. క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, పంజాబ్‌లో ఫాతిమా వైద్య క‌ళాశాల వంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఆయా ప్ర‌భుత్వాలు చొర‌వ చూపి అక్క‌డి విద్యార్థుల‌ను ఆదుకున్నాయి. త‌మ విద్యార్థుల‌కు న్యాయం చేశాయి. కానీ ఇక్క‌డ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వైద్య విద్యార్థ‌ల‌ను మోసం చేసింది. అయిదుసార్లు క‌లిసినా ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. సీట్లు ఇచ్చిన‌ట్లు నంద్యాలలో ప్ర‌చారం చేసి, విద్యార్థుల‌తో స‌న్మానం కూడా చేయించుకున్నారు. సుప్రీంకోర్టులో విచార‌ణ స‌మ‌యంలో ప్లేటు ఫిరాయించారు. విద్యార్థ‌ల‌ను ఆదుకునేందుకు క‌నీసం అఫిడవిట్ కూడా దాఖ‌లు చేయ‌లేదు.

ఇంత కంటే దారుణం ఏముంటుంది? త‌మ‌కు సంబంధం లేని విష‌యంలో విద్యార్థులు న‌ష్ట‌పోతుంటే కాపాడ‌వ‌ల‌సిన బాధ్య‌త లేదా? ఏడాదిపాటు త‌ర‌గ‌తుల‌కు హాజ‌రైన త‌ర్వాత ఇప్పుడు సీట్లు ఎలా ర‌ద్దు చేస్తారు? వ‌చ్చే ఏడాది 100 సీట్లు వ‌దులుకుంటామ‌ని సుప్రీంకోర్టులో బాబు ప్ర‌భుత్వం ఎందుకు చెప్ప‌లేక‌పోయింది? ప్రైవేటు క‌ళాశాల‌ల యాజ‌మాన్యాల‌తో లాలూచీ ప‌డ‌డ‌మే కార‌ణ‌మా? అందుకే చెప్ప‌లేక‌పోయారా?

సిగ్గు, శ‌రం ఉంటే వెంట‌నే ఫాతిమా క‌ళాశాల‌ వైద్య విద్యార్థుల‌ను ఆదుకోండి వారు న‌ష్ట‌పోకుండా చూడండి. 

Click here for PhotoGallery