ముస్లింలకు సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

01-09-2017

ముస్లింలకు సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

దైవప్రవక్త అజ్రత్‌ ఇబ్రహాం త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే ఈద్‌-ఉల్‌-జుహా (బక్రీద్‌) పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగస్మరణను పురస్కరించుకుని ఈర్ష్య, అసూయా ద్వేషాలకు అతీతంగా త్యాగమయ సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రజలందరం పునరంకితమవుదామనిన ఆయన పిలుపు నిచ్చారు. సమాజంలో పేదరికం, దారిద్య్రంతో బాధపడుతున్న లక్షలాది ప్రజల సముద్ధరణకు ఈ సందర్భంగా మనమంతా కలిసి  కృషి చేద్దామని ఆయన కోరారు.