చంద్రబాబు నివాసం వద్ద సంబరాలు

29-08-2017

చంద్రబాబు నివాసం వద్ద సంబరాలు

నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు టీడీపీ శ్రేణులు అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్దకు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని బాణాసంచా పేల్చారు.  ఈ సందర్భంగా సీఎం నివాసం వద్దకు పార్టీ నాయకులు చేరుకని ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల నియోజకవర్గ అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి విజయానికి కృషిచేసిన నాయకులకు అభినంనదలు తెలియజేవారు. మంత్రి నారా లోకేష్‌కు స్వీటు తినిపించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పి.నారాయణ, నక్కా ఆనందబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.