టీడీపీ శ్రేణుల సంబరాలు

28-08-2017

టీడీపీ శ్రేణుల సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిచారు.  27,466 ఓట్ల ఆధిక్యంతో ఆయన ఘన విజయం సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఆందనోత్సహాల్లో మునిగి తేలాయి. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు బాణాసంచా కల్చి మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు  సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక విజయం ప్రజలదేనని అన్నారు. ఓటమి భయంతోనే జగన్‌ ఏకంగా రెండు వారాల పాటు నంద్యాలలో తిష్ట వేసి ప్రచారం చేశారని, అయినా ప్రజలు ఆయనను తిరస్కరించారన్నారు.