చంద్రబాబు పాలనకు నంద్యాల ఫలితం నిదర్శనం

28-08-2017

చంద్రబాబు పాలనకు నంద్యాల ఫలితం నిదర్శనం

తెలుగుదేశం పార్టీ మూడేళ్ల పాలనకు నంద్యాల ఉప ఎన్నిక ఫలితం నిదర్శనమని మంత్రి సొమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చంద్రబాబు పాలనపై సంతృప్తిగా ఉన్నారని మరోసారి సృష్టమైందని పేర్కొన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు చంద్రబాబు పడుతున్న కష్టాన్ని నంద్యాల ప్రజలు గుర్తించారని అన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో జగన్‌ వాడిన భాష ప్రజలకు ఆగ్రహం తెప్పించిందని అదే ఫలితాల్లో సృష్టమవుతోందన్నారు. వైకాపా సంస్కృతి ఎలాంటిదో  రోజా లాంటి నేతలను చూస్తేనే తెలుస్తోందని మండిపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌, రోజాతో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తే తెలుగుదేశం పార్టీదే విజయమని ఎద్దేవా చేశారు. నంద్యాల ఫలితంతో కాకినాడ కార్పోరేషన్‌ ఎన్నికలకు సంబంధం ఉండదని, అక్కడా భారీ మెజారీటీతో గెలవబోతున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.