టీడీపీలో చేరిన గంగుల ప్రతాపరెడ్డి

18-08-2017

టీడీపీలో చేరిన గంగుల ప్రతాపరెడ్డి

నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితో కలిసి ఆయన విజయవాడలోని సిద్థార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో జరుగుతున్న నర్సరీ ఎక్స్‌సో వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. టీడీపీలో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. బుధవారం రాత్రి ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసి చర్చించిన తాను టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు గుంగుల తెలిపారు. గురువారం ఆ లాంఛనాన్ని పూర్తి చేసుకుని, చంద్రబాబు ఆధ్వర్యంలో అభివృద్ధి బాటలో నడుద్దామని తన అనుచర గణానికి పిలుపునిచ్చారు. ముందు నుంచీ చంద్రబాబు,  తాను మంచి స్నేహితులమని, గతంలో కూడా చంద్రబాబుపై సమస్యల విషయంలో మాట్లాడానని విమర్శించలేదన్నారు. గతంలో నాకు భూమా నాగిరెడ్డితో విభేదాలు ఉండేవని అంగీకరించారు. అయితే ఇప్పుడాయన లేడు. ఆ చిన్న పిల్లలతో విభేదాలేముంటాయి అని వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.