రసపట్టులో నంద్యాల ఎన్నికలు

17-08-2017

రసపట్టులో నంద్యాల ఎన్నికలు

నంద్యాలలో రాజకీయం మంచి రసపట్టులో పడింది. ప్రధాన పార్టీలు స్థానిక నేతలతో నిత్యం చిన్న, పెద్ద సమావేశాలు జరుపు తూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఓటును కూడా నిర్లక్ష్యం చేయరాదన్న పట్టుదల పార్టీల్లో ముఖ్యంగా తెదేపా, వైకాపాల్లో కనిపిస్తోంది. ఏ చిన్నపాటి అవకాశాన్నీ వదల కుండా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయ త్నాలను నేతలు చేస్తున్నారు. ప్రతి రోజూ లక్షలాది రూపా యలు వ్యయం చేసి భారీగా జనాన్ని పోగేసి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీలు ప్రచార లోపం లేకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నా, లోలోపల మాత్రం బెంగటిల్లు తున్నాయి. గెలుపు ఖాయమని ఘంటాపథంగా పైకి చెబు తున్నా, ప్రతి ఓటు ఎంతో అమూల్యమైనదిగానే పరిగణిస్తు న్నారు.

ప్రచార పర్వంలో వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డి నూతన పంథాను ఆవిష్కరించగా, తెదేపా మాత్రం అంతు చిక్కని వ్యూహాలతో చాపకింద నీరులా పరిస్థితిని చక్కబెట్టే స్తోంది. గ్రామీణ స్థాయిలోనే కాకుండా మున్సిపాలిటీ పరిథి లో కూడా నాలుగు ఓట్లను వేయించగల గల్లిd స్థాయి నేత లను కూడా వదలడం లేదు. తనదైన శైలిలో పదునైన వ్యాఖ్యలతో వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డి నిస్సందే హంగా ప్రచార పర్వంలో కొత్త అలజడిని సృష్టించారు. ఆయనకు ధీటుగా మంత్రులు స్పందిస్తున్నా అంతే స్థాయిలో ప్రభావం చూపించిందా అంటే చెప్పలేని పరిస్థితి. అయితే, జగన్‌తో పాటు అభ్యర్తి శిల్పా మోహన్‌ రెడ్డి, మహిళా నేత రోజా, తదితరులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు జనంలోకి చొచ్చుకుపోయినా, అవి ఎటువంటి ప్రభావం చూప నున్నాయన్నది కూడా ప్రశ్నార్ధకమే. తాత్కాలికంగా అటువంటి వ్యాఖ్యలు ఈలలు, చప్పట్లు కొట్టించినా, చల్లారిన తర్వాత పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నది తేదేపా అంచనా. కచ్చితంగా తమకే లాభిస్తుందన్న ఆశావహ దృక్పథంతో తేదేపా నేతలు ఉన్నారు.  బాలకృష్ణ రోడ్‌ షోలతో తెదేపా శ్రేణుల్లొ ను, నేతల్లోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది.

అలాగే, 19, 20 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాల పర్యటనతో పరిస్థితి పూర్తిగా తమకు అనుకూలంగా మారుతుందన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. కాగా, తమ పార్టీ తటస్తంగా ఉంటుం దని జనసేన అధినేత ప్రకటించడంతో నియోజకవర్గంలోని ఆయన అభిమానులు, కార్యకర్తలు ఏ పార్టీకి మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది. ] నంద్యాల నియోజకవర్గంలో బాగా పట్టున్న గంగుల కుటుంబం నుంచి మాజీ ఎంపి ప్రతాపరెడ్డి తెదేపాలో చేరడంతో రాజకీయం మరింత రసకందాయంలో పడింది. గంగులకు గోస్పాడు, నంద్యాల పట్టణంలో మంచి పట్టు ఉందని, బలబలాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుం దని అంచనా వేస్తున్నారు.