మంత్రి అఖిలప్రియకు కన్నీరు ఆగలేదు…

02-08-2017

మంత్రి అఖిలప్రియకు కన్నీరు ఆగలేదు…

నంద్యాల ఉప ఎన్నికకు తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేస్తుండగా మంత్రి అఖిలప్రియ కన్నీరు పెట్టారు. టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ప్రసంగిస్తుండగా అఖిలప్రియ భావోద్వేగానికి లోనయ్యారు. మంత్రి అఖిలప్రియ తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. గతంలో తండ్రి, తల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఇంతటి టెన్షన్ ఉండేది కాదు. కాని ఇప్పడు టఫ్ ఫైట్ కావడంతో ఆమెలో కలవరపాటు కన్పిస్తోంది. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ బాబాయి నాగిరెడ్డి ఆశయసాధనకు కృషి చేస్తానని, తన చెల్లెలు అఖిలప్రియకు ఎప్పుడూ అండగా ఉంటానని బ్రహ్మానందరెడ్డి అనడంతో ఆమెకు కన్నీరు ఆగేలేదు. ప్రజల అండ ఉండగా తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు భూమా. తన తండ్రి భూమా నాగిరెడ్డి గుర్తుకురావడంతో అఖిలప్రియ ప్రజల ఎదుటే వెక్కివెక్కి ఏడ్వటం పలువురిని కలచివేసింది.