second phase of YSR vahana mithra inaugurated CM Jagan

కొవిడ్‍ పరిస్థితుల కారణంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కుటుంబాల అవస్థలు దృష్టిలో ఉంచుకుని వాహన మిత్ర ఆర్థిక సాయాన్ని ముందే విడుదల చేస్తున్నామని ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2,62,493 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు వరుసగా రెండో ఏడాది రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ఆన్‍లైన్‍ ద్వారా సీఎం విడుదల  చేశారు. ఈ సందర్భంగా రవాణాశాఖ అధికారులు, డ్రైవర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎవరికైనా సాయం అందకున్నా ఆందోళన అవసరం లేదని, గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 4న మిగిలిన వారికి 10 వేల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. ఈ ఏ డాది లబ్ధిదారులు మరో 37,754 మంది పెరిగారని ముఖ్యమంత్రి తెలిపారు.