Jagan Directs Officials to Clear Rs 1323 Crore Housing Dues to Poor in Andhra Pradesh

-మిగిలిన‌వ్నీ ఒకెత్తు..ఇదొక్క‌టే ఒకెత్తు
-ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టిన వైఎస్ జ‌గ‌న్‌
-ప్ర‌భుత్వానికి పేరు తెస్తుంద‌నే ఆలోచ‌న‌

కూడు,గూడు, గుడ్డ‌... నిలువ నీడ లేని నిరుపేద మ‌న‌సులో ఈ మూడింటికీ ఎప్ప‌టికీ విలువ ఉంటుంది. మిగిలిన రెండింటి విష‌యం ఎలా ఉన్నా గూడు అనేది మాత్రం నిరుపేద‌లకు అంద‌ని ద్రాక్ష‌గానే ఉంటూ వ‌స్తోంది. అందుకే ప్ర‌తి  రాజ‌కీయ పార్టీ పేద‌ల‌కు ఇళ్ల గురించి ఎన్నిక‌ల ముందు త‌ప్ప‌నిస‌రిగా హామీలు గుప్పిస్తుంటాయి. ఆ త‌ర్వాత ఆచ‌ర‌ణ‌లో నామ్‌కే వాస్తేగా మార్చేస్తుంటాయి. 

ఈ నేప‌ధ్యంలో ఇచ్చిన హామీల అమ‌లే త‌న తొలి ప్రాధాన్యంగా ప‌నిచేస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైసీపీ ప్ర‌భుత్వం... అదే క్ర‌మంలో పేద‌లకు ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై కూడా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ ప‌ధ‌కాన్నిసిఎం వైఎస్ జ‌గ‌న్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. నిరుపేద‌ల సొంతింటి క‌ల తీర్చ‌డం అంటే  క‌నీసం 3 ద‌శాబ్ధాల పాటు పాలించాల‌నే త‌న క‌ల సాకారానికి ఇది అతిపెద్ద ఆస‌రా కాగ‌ల‌ద‌ని జ‌గ‌న్ ఆశిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే ఎన్న‌డూ లేనంత భారీ సంఖ్య‌లో ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేప‌ట్టారు. అలాగే ఇళ్ల నిర్మాణం కూడా అనూహ్య‌స్థాయిలో ఉండాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. స్థానిక ఎన్నిక‌లు, క‌రోనాల కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఇళ్ల ప‌ట్టాల పంపిణీకి జులై 8 ముహూర్తం పెట్టింది వైసీపీ ప్ర‌భుత్వం. వైయస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా జులై 8న పంపిణీచేయనున్న పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమంపై తాజాగా సీఎం సమీక్ష నిర్వ‌హించారు. ఈ పంపిణీ కార్య‌క్ర‌మం స‌జావుగా సాగాల‌ని, నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల‌ని అధికారుల‌కు సూచించారు. వారి కేటాయించిన స్థలంవద్దే అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వాలని ఆదేశించారు. 

 

మ‌రోవైపు పేదలకు ఇళ్ల నిర్మాణంపై కూడా సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

స‌మావేశం నిర్వ‌హించారు. దీనికి గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌సహా అధికారులు హాజరయ్యారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించామ‌నీ, అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగాలని స్ప‌ష్టం చేశారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు తాను చూడాలన్నారు. ప్ర‌భుత్వం క‌ట్టించిన ఇళ్లు అంటే నాసిరకం అనే పేరుపోవాలనీ,  ప్ర‌భుత్వం ఇస్తే నాణ్య‌మైన‌వే ఇస్తుంద‌నే పేరు రావాల‌ని సూచించారు. ఇది నిరు పేదలకోసం చేస్తున్న బ్ర‌హుత్త‌ర కార్యక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే త‌ప్ప‌కుండా పుణ్యం దక్కుతుందంటూ హిత‌వు ప‌లికారు. ఇళ్ల నిర్మాణం ద్వారా కొత్త‌గా ఏర్పాటు కానున్న‌ కాలనీల్లో మౌలిక సదుపాయాలకల్పనపైనా కూడా ఆయ‌న స‌మీక్షించి త‌గిన ఆదేశాలు జారీ చేశారు. వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచే వీలుందేమో చూడాల‌ని ఆయ‌న కోరారు. నిర్దేశిత డిజైన్‌లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై అధికారులతో చ‌ర్చించారు. డిజైన్‌లో భాగంగా బెడ్‌ రూం, కిచెన్, లివింగ్‌ రూం, టాయిలెట్, వరండా సహా సదుపాయాలు అన్నీ ఉండేలా చూడాల‌న్నారు. ఇంటి నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పేదవాడిపై ఒక్క రూపాయి అప్పు అనేది లేకుండా ఇంటిని సమకూర్చాలన్నారు. 

ఇళ్లబకాయిలను చెల్లించాలని సీఎం నిర్ణయం 

గ‌త ప్ర‌భుత్వం పేద‌ల‌కు పెట్టిన బ‌కాయిలు కూడా చెల్లించాల‌ని వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యించారు. మొత్తం 3,38,144 ఇళ్లకు గానూ బ‌కాయి ప‌డ్డ‌ రూ.1,323 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. గత ప్రభుత్వం బకాయిపెట్టినా, పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు సమీకరించుకుని చెల్లింపులకు ఒక తేదీ ప్రకటించాలని ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ఈ చెల్లింపులు చేయాలని ఆదేశించారు.

మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల నిర్మాణంపై సీఎం సమీక్ష