అది అయిపోయింది..ఇప్పుడు మార్చడానికి లేదు

అది అయిపోయింది..ఇప్పుడు మార్చడానికి లేదు

16-02-2020

అది అయిపోయింది..ఇప్పుడు మార్చడానికి లేదు

రాజధాని ఎక్కడ ఉండాన్నది రాష్ట్ర ఇష్టమేననీ, ఆ విషయంలో తాను ఏకీభవిస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడి రైతుల ఉద్యమానికి సంఫీుభావం తెలిపారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ అమరావతినే రాజధానిగా గతంలో అందరూ అంగీకరించి, ఇప్పుడు మార్చడం సరికాదన్నారు. ఇష్టానుసారం నిర్ణయాలను మార్చుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులను సీఎం జగన్‌ నమ్మించి గొంతు కోశారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలోనే ఉండేలా పోరాటం చేస్తానన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రైతులు  భూములిచ్చారు. రాష్ట్రానికి అమరావతే రాజధాని అని నిర్ణయం తీసెసుకున్నాం. అది అయిపోయింది. ఇప్పుడు మార్చడానికి లేదు. 151 మంది ఎమ్మెల్యేలు మార్చుకుంటాం.. 13 రాజధానులు.. 13 ముక్కులు.. 33 ముక్కులు చేస్తామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. తమ ఇష్టానికి చేసుకోవడం కుదరదు అని వ్యాఖ్యానించారు.