విశాఖ ఐటీ పార్కును సందర్శించిన అమెరికా ప్రతినిధులు

విశాఖ ఐటీ పార్కును సందర్శించిన అమెరికా ప్రతినిధులు

15-02-2020

విశాఖ ఐటీ పార్కును సందర్శించిన అమెరికా ప్రతినిధులు

అమెరికాకు చెందిన స్టేట్‌ ఆటో ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఏసీ) విశాఖలో కేపిటివ్‌ డెవప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. ఆ కంపెనీ ప్రతినిధుల బృందం అమరావతిలో ఐటీశాఖ మంత్రి గౌతంరెడ్డిని కలిసి, విశాఖపట్నం వచ్చింది. ఏపీ రాష్ట్ర ఐటీ అసోయేషన్‌ (ఐటాప్‌) ప్రతినిధులు నారాయణ, శ్రీధర్‌ కొసరాజు, రాష్ట్ర ఐటీ సహాదారు శ్రీకాంత్‌రెడ్డి వారిని రుషికొండ ఐటీ పార్కుకు తీసుకువెళ్లి చూపించారు. ఇక్కడ వేయిమందితో సెంటర్‌ ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నారని, త్వరలోనే మళ్లీ విశాఖ వస్తారని ఐటాప్‌ వర్గాలు తెలిపాయి. ఎస్‌ఎఫ్‌ఏసీ బృందంలో సంస్థ సీఎస్‌ఓ గ్రెస్‌ తచ్చేటి, సీటీఓ రాము లింగా, వైఎస్‌ ప్రెసిడెంట్‌ సురేశ్‌ దండు ఉన్నారు.