రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీయేలో చేరతాం

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీయేలో చేరతాం

15-02-2020

రాష్ట్ర  ప్రయోజనాల కోసం ఎన్డీయేలో చేరతాం

రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీయేలో కూడా చేరతామని, ఎవరినైనా గడ్డం పట్టుకుని బతిమిలాడే స్థాయికైనా దిగుతామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బీజేపీతో తాము అంటిపెట్టుకుని ఉండటం లేదని, అలాగని వారికి దూరంగా కూడా లేమని అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో అనవసరంగా ఎందుకు ఘర్షణ పడాలని అడిగారు. రాష్ట్ర పురపాకశాఖ కార్యాలయాన్ని విశాఖపట్నం బీచ్‌ రోడ్డులోని పురపాకశాఖ అతిథిగృహం ప్రాంగణంలో నిర్మిస్తామని వెల్లడించారు.