పేదరికం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖలో జరుగుతున్న మహానాడు వేదికపై ఆయన ప్రసంగించారు. సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉందని  అన్నారు. బీసీలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామని తెలిపారు. కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, వెయ్యి కోట్లు కేటాయించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని కొందరు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చేతివృత్తుల వారికి కూడా ఆదుకుంటామని చెప్పారు.