AP-govt-Established-New-Department/

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటైంది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త శాఖను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలో 37వ శాఖగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఏర్పాటైంది. ఈ శాఖలో ఒక కార్యదర్శి, అదనపు కార్యదర్శితో పాటు ఇతర సిబ్బంది కేటాయించనున్నారు. గతంలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల విభాగాన్ని ఈ శాఖలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.