Chandrababu to launch TDP Party Office in Mangalagiri

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. చంద్రబాబు దంపతులు శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం మూడు బ్లాకులుగా చేపట్టిన ఈ నిర్మాణం మొదటి బ్లాకు ప్రస్తుతం పూర్తి అయింది. 75 వేల అడుగుల విస్తీర్ణంలో ఈ బ్లాకు ఉండడం విశేషం. మూడవ అంతస్తులో చంద్రబాబు, ఆయన తనయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు తన చాంబర్‌లోకి పూజాది కార్యక్రమాలు అనంతరం ప్రవేశించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడుకి చాంబర్‌ను కేటాయించారు. అంతేకాకుండా ఇరు పార్టీ అధ్యక్షులకు అదే విధంగా జిల్లా అధ్యక్షులకు, పార్టీ కీలక నేతలకు క్యాబిన్‌లు ఏర్పాటు చేశారు.