JanaSena Chief Pawan Kalyan donated Rs 1 crore to Indian Army

సైనిక కుటుంబాలకు అండగా ఉండేందుకు కేంద్రీయ సైనిక్‌ బోర్డు కు రూ.కోటి విరాళంగా అందజేస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో ప్రకటించారు. సైనిక బోర్డుకు సహకరించాలని బ్రిగేడియర్‌ మృగేంద్రకుమార్‌ నుంచి తనకు అందిన లేఖను ట్వీట్‌ చేశారు. ఈ లేఖతో దేశంపై తనకున్న బాధ్యతను గుర్తు చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా సైనిక బోర్డుకు సహకరించాలని పవన్‌ కోరారు.