విశాఖలో ప్రారంభమయిన మహానాడు

27-05-2017

విశాఖలో ప్రారంభమయిన మహానాడు

ఉక్కునగరంలో జరుగుతున్న మహానాడు అట్టహాసంగా ప్రారంభమయింది. ఇందులో భాగంగా ముందుగా  తెలుగుదేశం ప్రతినిధుల నమోదుతో కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్‌, బాలకృష్ణ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌, రక్తదాన శిబిరాలను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన వేదికపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయన్ను కలిసి అభివాదం చేశారు. నాయకులు, మంత్రులు, ఎమ్మెల్మేలు ఆయనకు శాలువాలు, పూలుమాలలు వేసి స్వాగతం తెలిపారు. మా తెలుగు తల్లికి మల్లెపూవు దండ పాటతో మహానాడు ప్రారంభించారు. అనంతరం గత ఏడాది చనిపోయిన టీడీపీ కార్యకర్తలకు నివాళి అర్పించారు. పసుపు పండుగకు రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో విచ్చేశారు. విశాఖ నగరమంతా పసుమమయం అయిపోయింది.