జనసేనకు ఊరట

20-09-2019

జనసేనకు ఊరట

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ ఇండియాకు ధన్యవాదాలు తెలిపారు. జనసేన కార్యకర్తల ట్విటర్‌ ఖాతాలను పునరుద్ధరించినట్టు పవన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. రాజ్యాంగ బద్దమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను నిలబెట్టినందుకు ట్విటర్‌ ఇండియాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జనసేన పార్టీ ఫాలోవర్స్‌ ట్విటర్‌ ఖాతాలను కొనసాగించినందుకు, వేగంగా స్పందించినందుకు మీకు థాంక్స్‌ అని పవన్‌ ట్వీట్‌ చేశారు. జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న 400 మంది కార్యకర్తల ట్విటర్‌ ఖాతాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.