కోడెల మృతి పార్టీకి తీరని లోటు : చంద్రబాబు

16-09-2019

కోడెల మృతి పార్టీకి తీరని లోటు  : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌రావు మృతి పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కోడెల మరణ వార్త తెలియగానే చంద్రబాబు గుంటూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సీనియర్‌ నేతలతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల కోడెల సంతాప సభలు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ కార్యాలయాలపై టీడీపీ జెండాలను అవనతం చేయాలని కోరారు.