మరో అంకానికి శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు

20-04-2019

మరో అంకానికి శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినా ముఖ్యమంత్రి చంద్రబాబు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎన్నికల కుముందు నుంచే ఎన్నికల సంఘంపై పోరాటం ప్రారంభించిన చంద్రబాబు ఇప్పుడు మరో అంకానికి శ్రీకారం చుట్టనున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలకు అనుకూలంగా ప్రచారం చేయబోతున్నారు. ఎన్నికలకు ముందునుంచే ఈసీపై సమరశంఖం పూరించి అన్ని పార్టీల మద్దతు కూడగట్టారు. ఇప్పుడు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే మోదీపై మరో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో బాబు ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కలిసి ప్రచార సభలో పాల్గొన్నారు. రాయచూర్‌ సభలో రాహుల్‌తో కలిసి ఒకే వేదికపై నుంచి ప్రసంగించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమి అభ్యర్థి బీవీ నాయక్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కూడా పలు రాష్ట్రాల్ల బీజేపీయేతర పార్టీలకు మద్దతుగా చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు.