మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని శ్రీయాగం

01-04-2019

మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని శ్రీయాగం

రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ శ్రీయాగం చేపట్టారు. విజయవాడలోని కేజే గుప్తా కల్యాణ మండపంలో రుత్విక్కుల ఆధ్వర్యంలో యాగం ప్రారంభించారు. మూడు రోజులపాటు వేద మంత్రోచ్ఛారణల నడుమ సాగే యాగం ఏప్రిల్‌ 3న ఉదయం పూర్ణాహుతితో ముగుస్తుంది. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మతాల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతంగా ఉండాలంటే ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రత్నకుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.