YS Jagan Praja Sankalpa Yatra

– విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం, తురకనాయుడు వలస శివారులోని శిబిరం నుంచి యాత్ర ప్రారంభం.

– శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు. అభిమానులు.

– యాత్రకు అన్ని వర్గాల ప్రజల సంఘీభావం.

– ఈ మధ్యాహ్నం విజయనగరం జిల్లాలో ముగియనున్న ప్రజా సంకల్పయాత్ర.

– జిల్లాలో 36 రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర. జిల్లాలో 9 నియోజకవర్గాలు, 5 మున్సిపాలిటీలు, 214 గ్రామాలలో మొత్తం 311.5 కి.మీ నడిచిన శ్రీ వైయస్‌ జగన్‌.

– విజయనగరం జిల్లాలో 9 చోట్ల బహిరంగ సభలతో పాటు, రెండు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్న జననేత.

– భోజన విరామం అనంతరం జరిగే పాదయాత్రలో రావివలస క్రాస్‌ దాటిన తర్వాత వీరఘట్టం మండలం కడకెల్ల వద్ద పాలకొండ నియోజకవర్గంలోకి అడుగుపెట్టనున్న శ్రీ వైయస్‌ జగన్‌.

– దీంతో రాష్ట్రంలో చివరిదైన 13వ జిల్లా ‘శ్రీకాకుళం’ లోకి ప్రవేశించనున్న జననేత.

– ఇక ఆదివారం ఉదయం పాదయాత్రలో జననేతను కలిసిన పలువురు. వివిధ సమస్యల ప్రస్తావన.

– వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టాక వ్యవసాయానికి 12 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయాలని జననేతను కోరిన మారడన రామకృష్ణ అనే రైతు.

– కొండ చాలకంలో విద్యార్థుల సౌకర్యం కోసం వసతి గృహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన మాజీ జడ్పీటీసీ కద్రక బలరామ్‌.

– మహానేత వైయస్సార్‌ చలువ వల్లనే తమకు ఇవాళ రూ.30 వేల పింఛను వస్తోందని జననేతను కలిసి కృతజ్ఞతలు తెలిపిన పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు కనకవలస సింహాచలం.

అంతకు ముందు నాడు చంద్రబాబు పెండింగులో పెట్టిన 3 విడతల డిఏను మహానేత వైయస్సార్‌ అధికారం చేపట్టిన వెంటనే మంజూరు చేశారని, దీంతో తమకు వేతనాలు పెరిగి, ఇవాళ తగిన పింఛను వస్తోందని రాజన్న బిడ్డకు వివరించిన మాజీ టీచర్‌ సింహాచలం.

– చంద్రబాబు మళ్లీ అధికారం చేపట్టాక కరువు పరిస్థితులు నెలకొన్నాయని, మరోవైపు ఎలాగోలా పంటలు పండించినా ఏ మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదని పాదయాత్రలో శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన కురుపాం రైతులు మొర పెట్టుకున్నారు. దీంతో పొట్ట చేతబట్టుకుని వలస పోతున్నామని విపక్షనేత వద్ద ఆవేదన చెందిన రైతులు.

పారిశ్రామికంగా ఉత్తరాంధ్ర ఎంతో వెనకబడిందని, చంద్రబాబు సీఎం అయ్యాక అక్కడ పరిస్థితి మరీ దారుణంగా మారిందని జననేతకు వివరించిన కురుపాం రైతులు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వలస పోతున్నామన్న రైతులు.

– తుపాను తర్వాత తమను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పాదయాత్రలో జననేతను కలిసిన తిత్లి తుపాను బాధితులు మొర పెట్టుకున్నారు.

కేవలం ఉప్పు, పప్పు ఇచ్చిన ప్రభుత్వం దాంతోనే సరి పెట్టిందని, ఏ మాత్రం నష్ట పరిహారం చెల్లించలేదని జరడకు చెందిన నర్సింగరావు అనే రైతు తెలిపారు. రాజన్న బిడ్డ సీఎం అయితేనే తమకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

– విశాఖ విమానాశ్రయంలో హత్యాప్రయత్నం తర్వాత కోలుకుని తిరిగి పాదయాత్ర చేస్తున్న శ్రీ వైయస్‌ జగన్‌ను చూసేందుకు కాకినాడ నుంచి వచ్చిన మహిళలు. ప్రజలందరి క్షేమం కోరుకునే జననేతకు ఏ ముప్పు వాటిల్లదని స్పష్టం చేసిన మహిళలు.

ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఏడాదికి పైగా అలుపెరగకుండా పాదయాత్ర చేస్తున్న రాజన్న బిడ్డను చూస్తే, అచ్చం ఆయన తండ్రిని చూసినట్లే ఉందన్న కాకినాడ మహిళలు. జననేత సీఎం అయితేనే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని తేల్చి చెప్పిన మహిళలు.

– ఆ తర్వాత నాగూరు చేరుకున్న శ్రీ వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. జననేతను చూసేందుకు బారులు తీరిన మహిళలు, విద్యార్థులు.

– గ్రామంలో ఒక మాఫియాలా మారిన జన్మభూమి కమిటీ ప్రతి పనికి లంచం ఆశిస్తోందని, తమకు అన్ని అర్హతలున్నా పింఛను రావడం లేదని, ప్రభుత్వ పథకం ఏదీ దక్కడం లేదని నాగూరులో పాదయాత్ర సందర్భంగా విపక్షనేతను కలిసిన చంద్రమౌళి ఫిర్యాదు చేశారు. 

మరోవైపు పలువురు వృద్ధులు కూడా కలిసి తమ బాధలు మొర పెట్టుకున్నారు. పింఛను కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయడం లేదని, జన్మభూమి కమిటీ వల్లనే ఇదంతా జరుగుతోందని జననేతకు ఫిర్యాదు చేసిన వృద్ధులు.

– ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించిన చంద్రబాబు, ఆ తర్వాత దారుణంగా మోసం చేశారని మరోవైపు విద్యార్థులు, నిరుద్యోగులు ఆరోపించారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా సక్రమంగా అమలు చేయడం లేదని వారు ఆక్షేపించారు.

– అనంతరం దత్తివలస మీదుగా చిలకాం క్రాస్‌ చేరుకున్న శ్రీ వైయస్‌ జగన్‌కు జన నీరాజనం. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు.

– గ్రామంలో పాదయాత్ర సందర్భంగా జననేతను కలిసిన రజక కుటుంబాలు. బట్టలు ఉతికేందుకు చెరువు లేక ఇబ్బంది పడుతున్నామని విపక్షనేతకు వివరించిన రజకులు.

– ఇక 18 ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేదని హెచ్‌ఐవీ కౌన్సెలింగ్‌ ఉద్యోగులు మొర పెట్టుకోగా, చాలీ చాలని జీతాలతో నానా అగచాట్లు పడుతున్నామని జననేతను కలిసి సమస్య చెప్పుకున్న 104 సర్వీసు ఉద్యోగులు.

– మరోవైపు చిన మేరంగికి చెందిన ఒంటరి కులస్తుల భేటీ. బీసీలు అయిన తమను ఓసీల జాబితాలో చేర్చారని, దీంతో తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విపక్షనేత వద్ద మొర పెట్టుకున్న ఒంటరి కులస్తులు. 

అందువల్ల తమను తిరిగి బీసీల జాబితాలో చేర్చేలా చూడాలని జననేతను వేడుకున్న ఒంటరి కులస్తులు.

– చిలకాంలో పాదయాత్ర అనంతరం శివారులోని తాత్కాలిక శిబిరం వద్ద భోజన విరామం కోసం ఆగిన శ్రీ వైయస్‌ జగన్‌.

– ఇక అంతకు ముందు దారి పొడవునా జననేతను కలిసి సమస్యలు చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు. తమ బిడ్డలను ఆశీర్వదించమని కోరిన తల్లులు. సెల్ఫీల కోసం ఆరాట పడిన మహిళలు, విద్యార్థినిలు.

– శ్రీ వైయస్‌ జగన్‌తో కలిసి అడుగులు వేసిన రైతులు, మహిళలు, విద్యార్థులు. ఇంకా ఆయనకు స్వాగతం చెప్పేందుకు పలు చోట్ల బారులు తీరిన ప్రజలు.  

– జననేతతో కరచాలనం కోసం పోటీ పడిన బస్సులు, ఇతర వాహనాల ప్రయాణికులు. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ యాత్రలో ముందుకు సాగిన శ్రీ వైయస్‌ జగన్‌.