అమెజాన్ గుడ్ న్యూస్

22-05-2020

అమెజాన్ గుడ్ న్యూస్

కోవిడ్‍ 19 సంక్షోభం, లాక్‍డౌన్‍ ఆంక్షల్లో చిక్కుకుని స్టార్టప్‍ కంపెనీల నుంచి దిగ్గజాల వరకు ఉద్యోగాల తొలగింపు, వేతనాల్లో కోత విధించడం వంటి నిర్ణయాలు తీసుకుంటుంటే, ఆన్‍లైన్‍ రీటైలర్‍ అమెజాన్‍ మాత్రం దీనికి భిన్నంగా వెళుతోంది. తమకు 50 వేల సిబ్బంది అవసరం పడుతుందని అమెజాన్‍ ఇండియా ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‍కు అనుగుణంగా 50 వేల మందిని నియమించుకోనున్నామని తెలిపింది. అమెజాన్‍ ఫ్లెక్స్లో స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్టైమ్‍ ఉద్యోగాల కింద వీరిని తీసుకుంటామని తెలిపింది. భారతదేశం అంతటా అమెజాన్‍ కేంద్రాలు, డెలివరీ నెట్‍వర్క్లో ఈ అవకాశాలుంటాయని ప్రకటించింది. ఈ మహమ్మారి సమయంలో వీలైనంత ఎక్కువ మందికి సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తామని అమెజాన్‍ కస్టమర్‍ ఫిల్లిమెంట్‍ ఆపరేషన్స్, వైస్‍ ప్రెసిడెంట్‍ అఖిల్‍ సక్సేనా ఒక ప్రకటనలో తెలిపారు.