కరోనాతో వైట్ హౌస్ మాజీ ఉద్యోగి మృతి

22-05-2020

కరోనాతో వైట్ హౌస్ మాజీ ఉద్యోగి మృతి

వైట్‍హౌస్‍ మాజీ ఉద్యోగి కరోనా కారణంగా మరణించారు. అమెరికా అధికార సౌధంలో విల్సన్‍ రూజ్‍వెల్ట్ జర్మన్‍ ఎన్నో ఏళ్లుగా బట్లర్‍ (ఇంటి పనులు చూసుకునే వ్యక్తి)గా పనిచేస్తున్నారు. ఇటీవల విల్సన్‍ కరోనా బారిన పడడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల మాజీ ప్రెసిడెంట్‍ ఒబామా భార్య మిచెల్లీ ఒబామా సంతాపం వ్యక్తం చేశారు. విల్సన్‍ వైట్‍హౌస్‍ను చాలా చక్కగా చూసుకునేవారని, ఆయన చనిపోవడం బాధకలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మిచెల్లీ ఒబామాతో పాటు హిల్లరీ క్లింటన్‍, లారా బుష్‍ తదితరులు కూడా విల్సన్‍ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.