ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

22-05-2020

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

ఐపీఎస్‍ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆంధప్రదేశ్‍ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్‍ను ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లోకి తీసుకోవడంతో పాటు సస్పెన్షన్‍ కాలం నాటి జీతభత్యాలు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వెంకటేశ్వరరావు సస్పెన్షన్‍ను సమర్థిస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‍ (క్యాట్‍) ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టిన హైకోర్టు, ఆయనను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సర్వీస్‍ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవటంపై సీనియర్‍ ఐపీఎస్‍ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్‍ చేసిన విషయం తెలిసిందే. భద్రతా ఉపకరణాల కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని పేర్కొంటూ ఆయనను సస్పెండ్‍ చేసింది. ప్రజాప్రయోజనాలరీత్యా ఆయనపై సస్పెన్షన్‍ వేటు వేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. సస్పెన్షన్‍కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్‍ బ్యాచ్‍ అధికారి.