భారత్‌కు ఉగ్రవాది జుబేర్‌

22-05-2020

భారత్‌కు ఉగ్రవాది జుబేర్‌

ఉగ్రవాద సంస్థలను నిధులు సమకూర్చారనే ఆరోపణలపై అమెరికాలో అరెస్టయిన జుబేర్‍ మహమ్మద్‍ ఇబ్రహీంను అక్కడి పోలీసులు భారత్‍కు తిప్పి పంపారు. జుబేర్‍ హైదరాబాద్‍కు చెందినవాడు. కరోనా నేపథ్యంలో అమెరికా జైళ్లలో ఉన్న ఖైదీలను సత్ప్రవర్తన, శిక్షాకాలం పూర్తికావొస్తున్న వారిని విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే జుబేర్‍ విడుదలయ్యాడు. అతడిని ప్రత్యేక విమానంలో భారత్‍కు పంపించారు. 2001-05 మధ్య కాలంలో యూనివర్సిటీ ఆఫ్‍ ఇల్లినాయిస్‍లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాల పట్ల ఆకర్షితుడయ్యాడు. 2011 ఉగ్రవాద సంస్థలకు నిధుల తరలింపు కేసులో అమెరికా పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని పంజాబ్‍లోని అమృత్‍సర్‍లో క్వారంటైన్‍ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.