లాక్‍డౌన్‍ ఎత్తేయకుంటే మరిన్ని మరణాలు

22-05-2020

లాక్‍డౌన్‍ ఎత్తేయకుంటే మరిన్ని మరణాలు

లాక్‍డౌన్‍ ఎత్తివేయకుంటే నిరాశ, నిస్పృహ, ఒంటరితనంతో ప్రజలు మరింత మంది చనిపోతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‍డౌన్‍ను సడలించి వ్యాపారాలను పునరుద్ధరించే అంశంపై వివిద దేశాలు ఆచితూచి స్పందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍ఓ) ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‍ వ్యాప్తితో తమకు సంబంధం లేదని ఓ చైనా అధికారి చేసిన ప్రకటనపై ట్విట్టర్‍ వేదికగా ట్రంప్‍ ప్రతిస్పందిస్తూ ఆ దేశం అసమర్థత వల్లే కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా సామూహిక మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు.