ఫేస్‍బుక్‍తో సామ్‍సంగ్‍ ఒప్పందం

22-05-2020

ఫేస్‍బుక్‍తో సామ్‍సంగ్‍ ఒప్పందం

సోషల్‍ మీడియా దిగ్గజం ఫేస్‍బుక్‍తో ఒప్పందం కుదుర్చుకున్నామని సామ్‍సంగ్‍ ఇండియా ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా ఆఫ్‍లైన్‍ రిటైలర్లు, డిజిటల్‍ విధానంలోకి మారడంపై శిక్షణ ఇస్తామని పేర్కొంది. మొదటి దశలో భాగంగా సామ్‍శాంగ్‍ ఇండియా, ఫేస్‍బుక్‍ ఇప్పటికే 800 మంది ఆఫ్‍లైన్‍ రిటైలర్లకు శిక్షణ ఇచ్చాం. రానున్న వారాల్లో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని ప్రకటనలో కంపెనీ పేర్కొంది. ఆఫ్‍లైన్‍ రిటైలర్లు ఫేస్‍బుక్‍ గ్రూప్‍నకు చెందిన ఫేస్‍బుక్‍, మెసెంజర్‍, ఇన్‍స్టాగ్రాం, వాట్సాప్‍ వంటి మాధ్యమాల ద్వారా డిజిటల్‍ విధానంలోకి మారేందుకు శిక్షణ ఇవ్వడమే దీని ఉద్దేశమని ప్రకటనలో సామ్‍శాంగ్‍ పేర్కొంది. సామ్‍శాంగ్‍ తాజాగా చేపట్టిన ఈ కార్యక్రమంతో కంపెనీకి భాగస్వాములుగా ఉన్న అనేక మంది ఆన్‍లైన్‍ ఎకోసిస్టమ్‍లోకి అడుగుపెట్టనున్నారు. ప్రపంచం వేగంగా డిజిటల్‍లోకి మారిపోతోంది. డిజిటల్‍ విధానం వినియోగదారులకు కూడా ఉపయోగపడనుంది. స్థానిక రిటైలర్ల పేజీలపై కూడా శామ్‍సంగ్‍ స్మార్ట్ఫోన్ల్ను కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు సమాచారాన్ని తెలుసుకోవచ్చని శామ్‍సంగ్‍ తన ప్రకటనలో పేర్కొంది.