దుబాయ్‍లో భారతీయుడికి జాక్‌పాట్

22-05-2020

దుబాయ్‍లో భారతీయుడికి జాక్‌పాట్

కరోనా కష్టకాలంలో ఓ భారతీయ వ్యాపారవేత్తకు జాక్‍పాట్‍ తగిలింది. దుబాయ్‍లో తీసిన డ్యూటీ ఫ్రీ లాటరీలో కేరళకు చెందిన నిర్మాణ రంగ వ్యాపారవేత్త రాజన్‍ కురియన్‍ 10 లక్షల డాలర్లు (రూ.7,55,20,000) గెలుచుకున్నారు. కొవిడ్‍ 19 నేపథ్యంలో ప్రపంచమంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా తాను ఈ లాటరీ గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో కొంత మొత్తాన్ని అవసరమైన వారికి సహాయం చేస్తానని చెప్పారు.