జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆటా కోవిడ్‍ 19 సహాయం

22-05-2020

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆటా కోవిడ్‍ 19 సహాయం

కరోనా వైరస్‍తో ఇబ్బందిపడిన జోగులాంభ-గద్వాల జిల్లాలో పేద ప్రజలకు అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. గద్వాల జిల్లాలోని చిన్న అమిదాలపాద్‍ గ్రామంలోని పేదలకు ఆటా టీమ్‍ సహాయ కార్యక్రమాలను నిర్వహించింది. 287 కుటుంబాలకు 5 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, 1 కేజీ ఆయిల్‍ను పంపిణీ చేశారు. చిన్న ఆమిదాలపాడు మాజీ సర్పంచ్‍ పొడువు కవితా రెడ్డి, పొడువు పుష్పవతి, ఇతర వలంటీర్లు ఈ సేవా కార్యక్రమాన్ని ఆటా తరపున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, ఇతరులకు ఆటా ధన్యవాదాలు తెలిపింది.

Click here for Photogallery