
ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంక్రాంతి వేడుకలు జనవరి 16న నిర్వహిస్తున్నారు. వర్చువల్‌గా నిర్వహించే ఈ వేడుకల్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రముఖ గాయని చిత్ర, పద్మశ్రీ శోభారాజు కచేరీలను లైవ్‌గా నిర్వహిస్తున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని, డ్యాన్స్ కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, చిన్నారులకు డ్రాయింగ్ పోటీలు వంటివి ఏర్పాటు చేశారు. దీంతోపాటు పలు ఇతర కార్యక్రమాలు కూడా కనువిందు చేయనున్నాయి. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ, ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్య చౌదరి లావు, మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, కార్యదర్శి రవి పొట్లూరి, తానా ట్రెజరర్ సతీష్ వేమూరి, ఫౌండేషన్ సెక్రటరీ రవి మందలపు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. కల్చరల్ సర్వీస్ కో ఆర్డినేటర్ సునీల్ పాంత్రా, మిడ్ అట్లాంటిక్ రీజినల్ కో ఆర్డినేటర్ సతీష్ చుండ్రు, పాఠశాల చైర్ నాగరాజు నలజుల తదితరులు కూడా ఈ?కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. టీవీ ఏసియాలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.