NATS: ఆకలి తీర్చే హృదయాలు.. కొనసాగుతున్న నాట్స్ గ్రేటర్ ఓర్లాండో అద్భుత కార్యక్రమం!
ఓర్లాండో: అమెరికాలో తెలుగు ప్రజల సేవకై అంకితమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS – North America Telugu Society), ‘హార్ట్స్ ఫర్ హంగర్ (Hearts for Hunger)’ పేరుతో గ్రేటర్ ఓర్లాండో ప్రాంతంలో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి చిన్న సాయం రేపటి రోజు ఎవరికైనా పెద్ద అండగా మారుతుందనే గొప్ప నినాదంతో ఈ సేవా కార్యక్రమం నవంబర్ 1, 2025 న ప్రారంభమై డిసెంబర్ 20, 2025 న ముగియనుంది. ఈ ముఖ్యమైన కార్యక్రమం డిసెంబర్ 20, 2025 న సాయంత్రం 5:00 PM గంటలకు ముగుస్తుంది. తెలుగు ప్రజలు ఈలోపు తమ వంతు సహాయాన్ని అందించి, ఈ గొప్ప ఉద్యమంలో భాగస్వాములు కావాలని నాట్స్ కోరుతోంది. ఈ సేవా కార్యక్రమాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి పర్యవేక్షిస్తున్నారు.
మరింత సమాచారం కోసం:
ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు, విరాళాల సేకరణ వంటి వాటి కోసం గ్రేటర్ ఓర్లాండో చాప్టర్ టీమ్‌ను సంప్రదించవచ్చు:
రవి కుమార్ రవి: 804-300-7153
వేణు మల్ల: 704-402-4173
రాజ శేఖర్: 352-807-7809
గోపాల రావు: 219-669-3585
ఈ కార్యక్రమ విజయానికి కృషి చేస్తున్న ముఖ్య సభ్యులు:
సుమంత్ రామినేని – SE ZVP
రవి కుమార్ రవి – చాప్టర్ కోఆర్డినేటర్
వేణు మల్ల – జాయింట్ కోఆర్డినేటర్
శ్రీదేవి మల్ల – ఉమెన్స్ కోఆర్డినేటర్
గోలి శ్రీధర్ – కమ్యూనిటీ సర్వీసెస్
రాజా శేఖర్ అంగ – ఈవెంట్ ఎగ్జిక్యూషన్
చంద్ర అచంట – స్పోర్ట్స్ కోఆర్డినేటర్
నాట్స్ హెల్ప్‌లైన్: helplines@natsworld.org లేదా +1-888-4-TELUGU, +1-888-483-5848
- Vishal.B






