Rolugunta Suri: ఈ నెల 14న ‘రోలుగుంట సూరి’ విడుదల
ఘనంగా ‘రోలుగుంట సూరి’ ప్రీ రిలీజ్ కార్యక్రమం
హైదరాబాద్: తెలుగు తెరపైకి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన మూవీ ‘రోలుగుంట సూరి’. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్ హీరోహీరోయిన్లుగా తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ తెలుగు ఫిలింఛాంబర్ లో ప్రీ రిలీజ్ కార్యకమాన్ని నిర్వహించింది.
దర్శకుడు అనిల్ కుమార్ పల్లా మాట్లాడుతూ – “ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రియల్ స్టిక్ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో సినిమాను అద్భుతంగా చేశారని అభినందించడం మా చిత్ర యూనిట్ కు కొత్త ఎనర్జీ వచ్చింది. మ్యూజిక్ పై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు లాంచ్ చేసిన మా సినిమాలోని పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనూప్ రూబెన్స్ గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. మా కృషిని, మా టీం టాలెంట్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది. ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ మా సినిమా టీమ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రేక్షకులకు ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని భరోసా ఇచ్చారు. ఇక మా సినిమా హీరో నాగార్జున పల్లా అథ్లెటిక్స్ లో నేషనల్ గోల్డ్ మేడలిస్ట్. సినిమా రంగంలో మంచి ఫ్యూచర్ ఉందని మా సినిమాలో యాక్టింగ్ టాలెంట్ తో నిరూపించుకున్నాడు. ఈ నెల 14న విడుదల అయ్యే ‘రోలుగుంట సూరి’ సినిమాను థియేటర్ కు వెళ్లి చూడాలని ప్రతీ ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను” అని అన్నారు.
హీరో నాగార్జున పల్లా మాట్లాడుతూ.. “నాకు ఇది ఫస్ట్ మూవీ. నేను స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి వచ్చాను. చాలా ఇష్టపడి చేశాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇదే టీంతో మరో ప్రాజెక్టు చేయడానికి సిద్ధమవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ థియేటర్ కు వెళ్లి సినిమా చూసి మాకు బ్లేసింగ్స్ ఇవ్వండి. ” అని కోరారు.
నిర్మాత సౌమ్య చాందిని పల్లా మాట్లాడుతూ… “’రోలుగుంట సూరి’ ఒక రియలిస్టిక్ విలేజ్ డ్రామా. భావోద్వేగాలతో, జీవిత సత్యాలతో మిళితమైంది. చిత్రయూనిట్‌లోని ప్రతి సభ్యుడు టాలెంట్ చూపించారు. సినిమా బాగా వచ్చింది. ఈ నెల 14న థియేటర్ కు వెళ్లి సినిమా చూసి హిట్ చేయాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాను.” అని తెలిపారు.
లిరిక్ రైటర్ రామారావు మాతుమూరు మాట్లాడుతూ… “ఈ మూవీ లో ప్రణయ విరహ గీతం “నిన్న.. మొన్న..” అనే పాట రాసాను. ఈ పాటను అనూప్ రూబెన్స్ విడుదల చేసి అభినందించడం ఆనందంగా ఉంది. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు ఈ పాటను ప్రత్యేకంగా ప్రశంసించడం మర్చిపోలేని అనుభూతి.” అని అన్నారు.
తెలుగులో ఒక అరుదైన, అద్భుతమైన సినిమాగా ‘రోలుగుంట సూరి’ నిలిచిపోవడం ఖాయమని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేశారు.







