Purushaha: పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ‘పురుష:’ టీం.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్
ఎంటర్టైన్మెంట్ అందించే చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. కామెడీ బేస్డ్ చిత్రాలకు ఎలాంటి లాజిక్ కూడా అవసరం ఉండదు. అందుకే స్టార్ హీరోలు సైతం కామెడీ బేస్డ్, ఎంటర్టైన్మెంట్ అందించే కథల్ని చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇక ఆడియెన్స్ సైతం థియేటర్‌కు కాస్త రిలాక్స్ అవ్వడానికి, ఎంటర్టైన్ కోసమే వస్తారు. అందుకే ప్రేక్షకులు ఎక్కువగా వినోదభరితమైన కథలకే పట్టం కడతారు. ఈ క్రమంలో అందరినీ నవ్వించేందుకు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘పురుష:’ టీం వస్తోంది.
ఇప్పటి వరకు ‘పురుష:’ టీం నుంచి వదిలిన పోస్టర్స్, క్యాప్షన్స్, పెళ్లి, ఆడ, మగ, స్వేచ్ఛ అంటూ వదిలిన పాయింట్స్ చూస్తుంటే ఆద్యంతం నవ్వించే కథతో సిద్దం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా వదిలిన మరో పోస్టర్ సినిమాపై ఇంట్రస్ట్ పెంచుతోంది. మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం అంటూ పోస్టర్ పై రాసిన లైన్ సినిమా పై ఇంకాస్త ఆసక్తిని పెంచింది. ఈ మూవీ విడుదల వరకు ఇలాంటి మరిన్ని పోస్టర్లు వదిలి ఇంట్రస్ట్ పెంచ నున్నారు మేకర్స్.
బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు పవన్ కళ్యాణ్ బత్తుల ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై ఆడియెన్స్‌లో మంచి బజ్ అయితే క్రియేట్ అయింది.
పవన్ కళ్యాణ్‌తో పాటుగా ఈ చిత్రంలో కసిరెడ్డి, సప్తగిరి పాత్రలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని టీం చెబుతోంది.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. అందరినీ ఎంటర్టైన్ చేసే ఈ మూవీని నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.
-Varma






