Prabhas: ప్రభాస్ క్షేమం గానే ఉన్నాడు – డైరెక్టర్ మారుతీ
పాన్ ఇండియా హీరో ప్రముఖ నటుడు, డార్లింగ్ ప్రభాస్ జపాన్ లో పర్యటిస్తున్నారు. ఈ నెల 12న ‘బాహుబలి: ది ఎపిక్’ జపాన్ లో విడుదల కానుంది. సినిమా ప్రచారం కోసం జపాన్ వెళ్లిన ప్రభాస్.. అక్కడి అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జపాన్ లో పెను భూకంపం సంభవించిందనే వార్తలతో ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
తమ హీరో ఎలా ఉన్నారోనని ఆందోళన చెందుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓ అభిమాని డైరెక్టర్ మారుతిని ట్యాగ్ చేస్తూ ‘జపాన్లో భూకంపం వచ్చింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మా హీరో ఎక్కడ, ఎలా ఉన్నాడు?’ అని ప్రశ్నించాడు. దీనికి మారుతి స్పందిస్తూ.. ‘ప్రభాస్తో ఇప్పుడే మాట్లాడాను. ఆయన క్షేమంగా ఉన్నారు. ఆందోళన చెందకండి’ అని జవాబిచ్చారు. డైరెక్టర్ మారుతి జవాబుతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
-Varma






