One/4: ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టదు.. వంద శాతం విజయం సాధిస్తాం.. వెంకటేష్ పెద్దపాలెం
తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్(One/4). బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నారు. ఈక్రమంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో..
హీరో వెంకటేష్ పెద్దపాలెం మాట్లాడుతూ .. ‘నాకు సినిమాలో అవకాశం ఇచ్చిన రోహిత్ గారు, రంజన గారికి థాంక్స్. కన్నడ లో సినిమా చేసిన తరువాత రోహిత్ గారితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి నాకు రోహిత్ మంచి స్నేహితుడిగా మారారు. తెలుగులో పెద్ద హీరోలతో సినిమా చేయాలని రోహిత్ ప్రయత్నిస్తున్నారు. నాది మదనపల్లి జిల్లా అని గర్వంగా చెప్పుకుంటున్నాను. టంగ్ స్లిప్ అనే పాయింట్‌తో ఈ క్రైమ్ డ్రామాను తీశాం. మా చిత్రంలో అద్భుతమైన ఆర్టిస్టులు పని చేశారు. హీరోయిన్లంతా కూడా అద్భుతంగా నటించారు. మా మూవీలో సుభాష్ గారి పాటలు, ఆర్ ఆర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. సాగర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటుంది. బాహుబలికి పని చేసిన పళని గారి టేకింగ్‌కు అందరూ ఫిదా అవుతారు. రాజమౌళి గారి స్టైల్లో ఈ మూవీని తీశారు. ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టించుకుండా సినిమాను తీశారు. డిసెంబర్ 12న వంద శాతం మేం హిట్ కొట్టబోతోన్నామ’ని అన్నారు.
దర్శకుడు బాహుబలి పళని మాట్లాడుతూ .. ‘‘సుభాష్ గారి ద్వారా నాకు రోహిత్ గారు, వెంకీ గారు పరిచయం అయ్యారు. వారికి నేను ఓ కథ చెప్పాను. అది వాళ్లకి బాగా నచ్చింది. అలా ఒక్కొక్కరిని ఈ చిత్రంలోకి తీసుకున్నాం. సుభాష్ గారి పాటలు, సాగర్ గారి కొరియోగ్రఫీ బాగుంటుంది. మా ఎడిటర్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. మా చిత్రం డిసెంబర్ 12న రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి ఎంకరేజ్ చేయండి’ అని అన్నారు.
నిర్మాత రంజన రాజేష్ గుంజల్ మాట్లాడుతూ .. ‘మాకు సౌత్ సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగు లో సినిమా ప్రేమికులు ఎక్కువగా ఉంటారు. అందుకే మేం ఇక్కడ సినిమాలు నిర్మించాలని అనుకున్నాం. మాకు టీం చాలా సహకరించింది. అందరూ అద్భుతంగా నటించారు. ఆ మూవీ చాలా బాగా వచ్చింది. మా చిత్రం డిసెంబర్ 12న రాబోతోంది. అందరూ థియేటర్ లో మా సినిమాను కుటుంబ సమేతంగా చూడండి’ అని అన్నారు.
నిర్మాత రోహిత్ రాందాస్ గుంజల్ మాట్లాడుతూ .. ‘మా సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. నా కల నిజం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మా చిత్రం బాగా వచ్చింది. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మాకు సహకరించిన వెంకీ గారు, పళని గారికి థాంక్స్’ అని అన్నారు.
అపర్ణ మల్లిక్ మాట్లాడుతూ .. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మేమంతా కలిసి సినిమాను చాలా కష్టపడి చేశాం. మా మూవీ చాలా బాగా వచ్చింది. అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీనా సోని మాట్లాడుతూ .. ‘‘వన్ బై ఫోర్’ సినిమాలోని పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. మా మూవీ డిసెంబర్ 12న రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి ఆదరించండి. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
కొరియోగ్రాఫర్ సాగర్ వేలూరు మాట్లాడుతూ .. ‘నాకు ఈ చిత్రంలో మంచి పాటలు ఇచ్చారు. రంజన, రోహిత్‌తో మా ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేను. వెంకీ గారు, అపర్ణ గారు చక్కగా నటించారు. పళని గారు మంచి కథతో రాబోతున్నారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్.’ అని అన్నారు.






