Mrunal Thakur: శారీలో అదిరిపోయే లుక్స్ లో మృణాల్
సీతారామం(sitaramam) సినిమాలో సీత(Sita)గా నటించి అందరి మనసుల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), ఆ సినిమా తర్వాత మరిన్ని సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మృణాల్ మేతి కలర్ శారీ ధరించి స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఎంతో అందంగా మెరిసింది. చీరకు తగ్గట్టుగా వేసుకున్న తన జ్యుయలరీ మృణాల్ అందాల్ని మరింత ఎలివేట్ చేయగా, ఈ ఫోటోలు చూసి నెటిజన్లు మృణాల్ అందాల్ని తెగ పొగుడుతూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.






