MSVG: ‘మన శంకరవర ప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ సాంగ్ శశిరేఖ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chirajeevi )మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు 2026 సంక్రాంతి గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ప్రమోషన్స్ ఇప్పటికే హై గేర్‌లో వున్నాయి. టీం అదిరిపోయే అప్డేట్స్ విడుదల చేస్తోంది. ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల చార్ట్‌బస్టర్ సంచలనంగా మారింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చిన సెకండ్ సింగిల్ ప్రోమోతో ఆసక్తిని రేకెత్తించిన తర్వాత నిర్మాతలు శశిరేఖ సాంగ్ ని విడుదల చేశారు.
భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన, మెలోడీ ట్రాక్ ని కంపోజ్ చేశారు. మెగాస్టార్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులని కట్టిపడేశాయి. అనంత శ్రీరామ్ సాహిత్యం మెగాస్టార్, నయనతార ప్రేమ ప్రయాణం అందంగా ప్రజెంట్ చేసింది. భీమ్స్, మధు ప్రియ బ్యూటీఫుల్ వోకల్స్ తో ట్రాక్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది.
భాను మాస్టర్ కొరియోగ్రఫీ మరో మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది. చిరంజీవి, నయనతార జోడి, వారి అందమైన డ్యాన్స్ మూమెంట్స్, ఆకట్టుకునే కెమిస్ట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా చిరంజీవి ట్రెడిషినల్, మోడ్రన్ అవుట్ ఫిట్స్ లో అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ చూడటానికి కన్నుల పండగలా వుంది. ఎగ్జాటిక్ లొకేషన్స్ లో చిత్రీకరించిన విజువల్స్ పాటను మరింత అందంగా తీర్చిదిద్దాయి.
చిరంజీవి,నయనతార ఇద్దరూ సొగసైన సాంప్రదాయ దుస్తులలో స్క్రీన్ ని మెస్మరైజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో ఈ ట్రాక్‌ను మల్టీలేయర్ మ్యూజిక్ కంపోజిషన్ తో భీమ్స్ వైరల్ సాంగ్ లా కంపోజ్ చేశారు. ఫుట్‌ట్యాపింగ్ బీట్లతో ఈ సాంగ్ ఇన్స్టంట్ బ్లాక్‌బస్టర్‌గా మారింది. సోషల్ మీడియా వెంటనే వైరల్ గా మారింది.
ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. VTV గణేష్, ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలు.
ప్రతి కొత్త అప్డేట్తో ఉత్సాహం పెరుగుతుండగా, మన శంకర వర ప్రసాద్ గారు 2026 సంక్రాంతికి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు.






