Radha Spaces ASBL

జీ తెలుగు అందిస్తోన్న సరికొత్త సీరియల్ మావారు మాస్టారు, ఈ సోమవారం, జూన్ 12 న ప్రారంభం

జీ తెలుగు అందిస్తోన్న సరికొత్త సీరియల్ మావారు మాస్టారు, ఈ సోమవారం, జూన్ 12 న ప్రారంభం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు 24 గంటలూ వినోదం పంచే జీ తెలుగు మరో సరికొత్త సీరియల్​తో మీ ముందుకు రానుంది. ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్​లతో సాగే సీరియల్స్​ను అందిస్తున్న జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్​ను వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. చదువుపై ఇష్టంతో నలుగురికీ బోధించే టీచర్​నే పెళ్లాడలని కలలు కనే ఓ అమ్మాయి.. తన కొడుకు నలుగురికీ బతకడం నేర్పించే బడిపంతులని గర్వపడే  ఓ తల్లి, వారిద్దరి అంచనాలకు అందని ఉద్యోగం చేస్తూ వేదన చెందే వ్యక్తి జీవితంతో ముడిపడిన కథతో సాగే సీరియల్​ మావారు మాస్టారు. ప్రేక్షకులకు తమ స్కూల్​ డేస్​ని గుర్తుచేస్తూ మనసుకి హత్తుకునే కథనంతో సాగే​ మావారు మాస్టారు, సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 07:30 గంటలకు, జూన్​ 12న ప్రారంభం, మీ జీ తెలుగులో! 

జీ తెలుగు అందిస్తున్న కొత్త సీరియల్​ భార్యాభర్తలు, అత్తాకోడళ్ల బంధానికి సరికొత్త అర్థం చెబుతుంది. టీచర్​నే పెళ్లి చేసుకోవాలని కలలు కనే శ్రీవిద్య, కొడుకు అందరూ గౌరవించే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడని సంతోషించే పార్వతి, తల్లి సంతోషం కోసం అబద్ధం చెప్పి వేదన చెందే గణపతి వంటి ప్రధాన పాత్రలతో ఈ కథ ముడిపడి ఉంటుంది. శ్రీవిద్యగా సంగీత కల్యాణ్​కుమార్​ నటిస్తుండగా, పార్వతిగా  తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన, జీ తెలుగు రక్తసంబంధం సీరియల్​తో వీక్షకులను అలరించిన ప్రముఖ నటి మీనా కుమారి నటిస్తున్నారు. గణపతిగా పృథ్వీరాజ్​ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పాపులర్​ నటుడు కౌశిక్​ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.

శ్రీవిద్యకు చదువంటే చాలా ఇష్టం. తన తల్లి మరణంతో చదువుకోలేకపోతుంది. కానీ ఎలాగైనా పెద్ద చదువులు చదవాలని ఆశ పడుతుంది. చదివించే వాడికంటే చదువు చెప్పేవాడైతే తన పక్కనే కూర్చుని చెబుతాడని ఆశపడుతుంది. అందుకే టీచర్​ని పెళ్లాడి తన ఆశ నెరవేర్చుకోవాలని కలలు కంటుంది. అంతులేని ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంగల శ్రీవిద్య తన జీవిత భాగస్వామిగా గణపతి తగినవాడని నమ్ముతుంది. గణపతి తండ్రి కూడా బడిపంతులుగా పదిమందికి మంచిని బోధించి సమాజంలో గౌరవం పొందినవారవడంతో తన కొడుకు కూడా అదే దారిలో నడవాలని కోరుకుంటుంది గణపతి తల్లి పార్వతి. కొడుకు టీచర్​గా పదిమందికి బతకడం నేర్పుతున్నాడని గర్వపడుతుంది. కానీ, అనుకోని పరిస్థితుల్లో తల్లిని సంతోషపెట్టడం కోసం గణపతి తాను టీచర్​నని అబద్ధం చెబుతాడు.

గణపతి చెప్పిన అబద్ధం అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుంది? టీచర్​ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న శ్రీవిద్య నిజం తెలుసుకుని ఏం చేస్తుంది? కొడుకు టీచర్​ అని సంతోషపడుతున్న పార్వతికి నిజం తెలిసిందా? శ్రీవిద్య కల నేర్చవేర్చేందుకు గణపతి, పార్వతి ఎలా మద్దతిచ్చారు?..  వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే తప్పక చూడండి.. మావారు మాస్టారు, మీ జీ తెలుగులో!  

మావారు మాస్టారు సీరియల్​ ప్రారంభంతో మిగతా సీరియల్స్​ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. మిఠాయి కొట్టు చిట్టెమ్మ మధ్యాహ్నం 12 గంటలకు, రాధకు నీవేరా ప్రాణం మధ్యాహ్నం 3  గంటలకు ప్రసారమవుతాయి. జీ తెలుగు ప్రేక్షకులు దయచేసి గమనించగలరు.

మావారు మాస్టారు, జూన్​ 12 న ప్రారంభం, సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు, మీ జీ తెలుగులో మాత్రమే!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :