ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.!

వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.!

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ విచారణ బృందాన్ని సుప్రీంకోర్టు మార్చేసింది. అంతేకాక.. వచ్చే నెలాఖరు లోపు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. లేకుంటే నిందితులకు సాధారణ బెయిల్ మంజూరు చేసేందుకు అంగీకరించింది. దీంతో ఈ కేసును త్వరతిగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు సీబీఐ ఏం చేస్తుందనేది ఆసక్తి కలిగిస్తోంది.

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసును మొదటి నుంచి విచారిస్తున్న రాంసింగ్ ను సుప్రీంకోర్టు తప్పించింది. ఆయన స్థానంలో సీబీఐ డీఐజీ కె.ఆర్.చౌరాసియా నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విచారణ కమిటీని సీబీఐ ప్రతిపాదించడంతో సుప్రీంకోర్టు అంగీకరించింది. కొత్త దర్యాప్తు బృందంలో చౌరాసియాతో పాటు ఎస్పీ వికాస్ సింగ్, ముఖేశ్ కుమార్, ఇన్ స్పెక్టర్ నవీన్ పునియా, అంకిత్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు.

కేసు దర్యాప్తుపైన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హత్య జరిగి నాలుగేళ్లవుతున్నా ఇంతవరకూ దర్యాప్తే పూర్తి కాకపోవడంతో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఏప్రిల్ నెలాఖరు లోపు దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికీ తీవ్ర జాప్యం అయినందువల్ల డెడ్ లైన్ విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో ఈ కేసును నెల రోజుల లోపు తేల్చాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివేకా హత్య కేసు మొదటి నుంచి అనేక మలుపులు తీసుకుంటూ వస్తోంది. కేసు విచారణకు మొదట అధికారులు సహకరించట్లేదని సీబీఐ ఆరోపించింది. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. దీంతో కేసు విచారణ వేగం పెరిగింది. ఎంపీ అవినాశ్ రెడ్డి కుటుంబం పాత్ర ఉందని అనుమానిస్తున్న సీబీఐ.. వారిని పలు దఫాలుగా విచారించింది. ఇంతలో దర్యాప్తు అధికారిని మార్చేసి కొత్త బృందానికి బాధ్యతలు అప్పగించడం సంచలనం కలిగిస్తోంది. పైగా దర్యాప్తును కూడా డెడ్ లైన్ పెట్టి క్లోజ్ చేయాలని చెప్పడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :