కేసీఆర్‌ పతనానికి ఇదే నాంది : వైఎస్‌ షర్మిల 

కేసీఆర్‌ పతనానికి ఇదే నాంది : వైఎస్‌ షర్మిల 

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై నిరసనగా ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద షర్మిల అమరణ దీక్షకు దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేసి అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ట్యాంక్‌బండ్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్‌ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ పదేపదే తప్పులు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ పతనానికి ఇదే నాందని అన్నారు. 

 

 

Tags :