ASBL NSL Infratech
facebook whatsapp X

వైఎస్ జ‌గ‌న్ పై వైట్ల పంచ్

వైఎస్ జ‌గ‌న్ పై వైట్ల పంచ్

ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ గా మంచి క్రేజ్ ఉన్న డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల గ‌త కొన్నేళ్లుగా ఫామ్ లో లేడు. అయితే శ్రీను వైట్ల‌కు ఓ స్పెష‌ల్ స్టైల్ ఉంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో కూడా ఎంట‌ర్టైన్మెంట్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్ల‌గ‌ల‌డు. ఇండ‌స్ట్రీ జ‌నాల మీదే సెటైర్స్ వేస్తూ కామెడీ ట్రాక్‌లు తీస్తాడ‌ని ఆయ‌న‌కు పేరు కూడా ఉంది.

అంతే కాదు సినిమా విష‌యంలో ఆయ‌న్ను ఎవ‌రైనా ఇబ్బంది పెడితే వాళ్ల పాత్ర‌ల‌ను త‌ర్వాతి సినిమాలో పెట్టి కౌంట‌ర్లు వేయ‌డం వైట్ల‌కు అల‌వాటు. అందులో కొన్ని స్పోర్టివ్ గా ఉంటే మ‌రికొన్ని అవ‌త‌లి వ్య‌క్తుల‌కు ఇబ్బంది క‌లిగించాయి. ఇక అస‌లు విష‌యానికొస్తే శ్రీను వైట్ల తాజా సినిమా విశ్వం టీజ‌ర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

ఈ టీజ‌ర్ లో వైట్ల మార్క్ డైలాగ్ ఒక‌టి హైలైట్ అయింది. టీజ‌ర్ లాస్ట్ లో మీరు కొట్టారు. తీసుకున్నాం. రేపు మాకు టైమొస్తుంది మేమూ కొడ‌తాం అంటూ సీరియ‌స్ గా డైలాగ్ చెప్తాడు. అది చూసిన వారంద‌రికీ ఈ డైలాగ్ వైసీపీ అధినేత జ‌గ‌న్ చెప్పిన డైలాగేన‌ని అర్థ‌మ‌వుతుంది. 2014 ఎల‌క్ష‌న్ల‌లో ఓడిపోయిన త‌ర్వాత జ‌గ‌న్ చెప్పిన డైలాగ్ ఇది. త‌ను చెప్పిన‌ట్లే త‌ర్వాత ఎల‌క్ష‌న్స్ లో ప్ర‌త్య‌ర్థుల‌ను గట్టిగా కొట్టి విజ‌యం సాధించాడు. కానీ మొన్న ఎల‌క్ష‌న్స్ లో జ‌గ‌న్ మ‌రీ ఘోరంగా ఓడిపోయాడు. ఇలాంటి టైమ్ లో జ‌గ‌న్ పాత డైలాగును వైట్ పెట్టడం వెనుక ఆయ‌న‌కు కౌంట‌ర్ వేసిన‌ట్లే ఉంది. మ‌రి జ‌గ‌న్ ఫ్యాన్స్ ఈ డైలాగ్ ను ఎలా తీసుకుంటారో చూడాలి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :