Radha Spaces ASBL

సీఎం వైఎస్ జగన్ ను ఆహ్వానించిన ... కేంద్ర ప్రభుత్వం

సీఎం వైఎస్ జగన్ ను ఆహ్వానించిన ... కేంద్ర ప్రభుత్వం

భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. డిసెంబర్‌ 5న న్యూఢిల్లీ లోని రాష్ట్రప్రతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్‌ ఆఫ్‌ ట్వంటీ ( జీ 20) దేశాలకు 2022 డిసెంబర్‌ 1 నుంచి 2023 నవంబర్‌ 30 వరకు భారత్‌ నేతృత్వం వహించనుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించిన వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :