ASBL NSL Infratech
facebook whatsapp X

రచ్చకెక్కిన వైసీపీ ఎమ్మెల్సీ ఇంటిగుట్టు..

రచ్చకెక్కిన వైసీపీ ఎమ్మెల్సీ ఇంటిగుట్టు..

ఐదేళ్ల పాలన తరువాత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఏమని ఓడిపోయిందో .. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతిరోజు ఆ పార్టీకి సంబంధించిన నాయకుల చరిత్రలు ఏదో ఒకటి బయటికి వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం టాక్ ద టౌన్ గా మారింది. ఆయన కుటుంబం గొడవలు మరొకసారి రచ్చకెక్కడంతో దువ్వాడ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టెక్కలి లోని దువ్వాడ నివాసం వద్ద అర్ధరాత్రి ఓ పెద్ద హైడ్రామా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వయసులో నీకు ఇదేమి బుద్దయ్య అని నెటిజెన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. కన్న కూతుర్ల విషయంలో దువ్వాడ ప్రవర్తన మరీ విడ్డూరంగా ఉంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

తమ తండ్రి వేరే మహిళతో ఉంటూ తమని పట్టించుకోవడం లేదని దువ్వాడ కుమార్తెలు హైందవి, నవీన తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫోను చేసినా తండ్రి స్పందించడం లేదని వాపోతున్నారు. దువ్వాడలో ఉన్న ఇంటికి ఆయన్ను కలవడానికి వచ్చిన ఇద్దరు కూతుర్లు తలుపులు తీయకపోవడంతో కారులోనే మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరీక్షించారు. ఐదు గంటల పాటు కన్న బిడ్డలు ఇంటి ముందు పడిగాపులు పడుతున్న దువ్వాడ నుంచి ఎటువంటి స్పందన లేదు. అర్ధరాత్రి వరకు తండ్రి కోసం చూసి ఆ పిల్లలు వెనుదిరిగి వెళ్ళిపోయారు.

ఈ నేపథ్యంలో ఆయన పెద్ద కుమార్తె మాట్లాడుతూ.. తన భర్త తండ్రి.. మామగారు చనిపోయినప్పుడు కూడా పరామర్శించడానికి దువ్వాడ రాలేదని పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్ లు పంపిన తన తండ్రి స్పందించలేదని.. ఎక్కడ గేటు తీసుకొని లోపలికి వస్తాము అన్న భయంతో తాళాలు వేసుకుని కూర్చున్నారని ఆమె వాపోయింది. చాలా రోజులుగా దువ్వాడ కుటుంబంలో పలు రకాల వివాదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 

అయితే ఇప్పటికీ ఆ గుట్టు రోడ్డు మీదకి వచ్చింది. దువ్వాడ అతని మొదటి భార్యతో చట్టపరంగా ఇంతవరకు విడాకులు తీసుకోలేదని ఆయన పిల్లలు స్పష్టంగా చెబుతున్నారు. అంతేకాదు విడాకులు తీసుకోకుండా వేరొక మహిళతో ఎలా ఉంటారు అని వారు ప్రశ్నిస్తున్నారు. దువ్వాడతో ప్రస్తుతం ఉంటున్న మహిళకు గతంలో పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారట. ఏదేమైనా కన్న పిల్లల విషయంలో దువ్వాడ ప్రవర్తన తీవ్ర దుమారాన్ని రేపుతోంది..

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :