వైసీపీ బాహుబలి టీమ్..

వైసీపీ బాహుబలి టీమ్..

2024లో ఏపీలో రాజకీయపోరాటంపై ఓ స్పష్టత వస్తోంది. ఓవైపు వైసీపీనేతలతో సన్నిహితంగా ఉంటూ వస్తున్న బీజేపీ హైకమాండ్.. చంద్రబాబుతోనూ సఖ్యత ప్రదర్శిస్తోంది. హస్తినలో అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు భేటీ తర్వాత.... రాజకీయ వ్యూహంపై  మరింత స్పష్టత వస్తోంది. మూడు పార్టీలు కలసికట్టుగా బరిలోకి దిగే సూచనలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒంటరిపోరాటానికి వైసీపీ సైతం సిద్ధమవుతున్న సంకేతాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ భారీ విజయం సాధించాలని వైసీపీ పట్టుదలతో ఉంది. సీఎం జగన్ .. వైనాట్ 175 అంటున్నారు. దీనికోసం అందివచ్చిన అస్త్రాలన్నీ వినియోగిస్తున్నారు. దీనిలో భాగంగా ఐటీ ఆర్మీని ప్రధాన ఆయుధంగా సంధించాలని చూస్తున్నారు. ఐటీ ఆర్మీని భారీగా రిక్రూట్ చేసి, విపక్షాలపై సోషల్ మీడియాలో పైచేయి సాధించాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో అన్ని పార్టీలతో పాటు వైసీపీకి ఓ ఐటీ విభాగం ఉంది. ఈ విభాగం ..ఇప్పుడు లక్ష మంది ఐటీ నిపుణులతో ఓ ఆర్మీని రెడీ చేస్తోంది. పార్టీ ఐటీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్.. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మిషన్ ఐటీ ఆర్మీని ప్రారంభించారు. పార్టీ అభిమానులైన ఐటీ నిపుణులు, ఉద్యోగులూ ఈ ఐటీ ఆర్మీలో చేరాలని సునీల్ కుమార్ పిలుపు ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అన్నారు.

ఏపీలో వివిధ సంక్షేమపథకాల్ని జగన్ సర్కార్ అమలు చేస్తున్నా.. యువతలో మాత్రం వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ లేకపోవడం.... వారిని తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు, లోకేష్ సభలు, యాత్రల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జాబ్ క్యాలెండర్ అమలు చేశామని గుర్తు చేస్తున్నారు. దీంతో యుూత్ సైతం విపక్షం వైపు ఆకర్షితులవుతున్నట్లు కనిపిస్తోంది. వారి సభలకు వస్తున్న యువతను చూస్తే.. ఇదే విషయం అర్థమవుతుంది.

ఐటీ ఆర్మీ ద్వారా యువతను ప్రబావితం చేసేలా వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ఐ ప్యాక్ మార్గనిర్దేశనం ఉండనే ఉంటుంది. ఫలితంగా యువతను.. తమవైపు తిప్పుకోవడంతో పాటు , విపక్షంపై వ్యతిరేకత పెరిగేలా వ్యూహరచన చేయనున్నారు. ప్రస్తుతం ఎక్కడ ఎన్నికలు జరిగినా జనాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. దీంతో మరోసారి ఐటీ ఆర్మీ సేవలను విస్తృతంగా వాడుకునే దిశగా వైసీపీ హైకమాండ్ అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :