ఆకట్టుకుంటోన్న ‘టైగర్ 3’ ట్రైలర్.. నవంబర్ 12న మూవీ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ చిత్రం ‘టైగర్ 3. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. ట్రైలర్‌ను చూసేద్దామా? అని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 16న మూవీ ట్రైలర్‌ను విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. చెప్పిన విధంగానే టైగర్ 3 ట్రైలర్‌ను యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా విడుదల చేయగా.. నెట్టింట తుపానులా ఈ ట్రైలర్ ఓ సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇదే నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘టైగర్ 3’ చిత్రాన్ని దీపావళి సందర్బంగా నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
దీపావళి సందర్బంగా నవంబర్ 12న టైగర్ 3’ను విడుదల చేయటానికి మేకర్స్ ఓ ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేశారు. 2023 సంవత్సరాన్ని అధికమాసంగా సంబోధిస్తున్నారు. అందుకు కారణం పండుగ రోజుల్లో సినిమా రిలీజ్‌లు భారీగా ఉన్నాయి. నవంబర్ 12 ఆదివారం అయితే 13వ తేది అమావాస్య, నవంబర్ 14న గోవర్ధన్ పూజ, గుజరాతీల కొత్త సంవత్సర వేడుకలు ఉంటాయి. నవంబర్ 15న భాయ్ దూజ్ పండుగ ఉంది. ఇలాంటి హాలీడేస్ సందర్భంగా విడుదలవుతున్న టైగర్ 3’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టైగర్ 3’ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలో మెప్పించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.