Radha Spaces ASBL

ఏపీ సీఎం జగన్‌తో వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ భేటీ

ఏపీ సీఎం జగన్‌తో వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కలిశారు. వరల్డ్ బ్యాంక్ భారత విభాగం డైరెక్టర్ అగస్టే కౌమే నేతృత్వంలోని బృందం జగన్‌ను కలిసింది. ఈ సందర్భంగా వరల్డ్ బ్యాంకు భాగస్వామ్యంతో ఏపీలో నడుస్తున్న పలు పథకాల ఎలా అమలవుతున్నాయని చర్చించారు. ఈ భేటీలోనే విద్యావ్యవస్థలో తాము తీసుకువస్తున్న సంస్కరణల గురించి సీఎం జగన్ వివరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు నుంచి మరింత సహకారం కావాలని జగన్ కోరారు. ఈ భేటీ గురించి వరల్డ్ బ్యాంకు డైరెక్టర్ అగస్టే కౌమే తన ట్విట్టర్‌లో స్పందించారు. ఏపీ సీఎం జగన్ తన విజన్‌ను తమతో పంచుకున్నందుకు అగస్టే కృతజ్ఞతలు చెప్పారు. అలాగే తను వణుకూరు, భవానీపురం, వెనిగండ్ల ప్రాంతాల్లో తాను పర్యటించానని చెప్పారు. ఆరోగ్యం, విద్య అంశాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలను కళ్లారా చూశానని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :