పుష్పరాజ్ ఆ రికార్డును బ్రేక్ చేస్తాడా?
గత నెల ప్రేక్షకుల ముందుకొచ్చిన స్త్రీ2 సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కొత్త రికార్డులను సృష్టించింది. ఈ ఇయర్ బాలీవుడ్ నుంచి చెప్పుకోదగగ్ సినిమా రాకపోవడంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆడియన్స్ కు స్త్రీ2 మంచి ఊరటనిచ్చింది. హారర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
దీంతో థియేటర్లలో స్త్రీ2 లాంగ్ రన్ ను సొంతం చేసుకుని, రూ.50 కోట్లతో తెరకెక్కి ఏకంగా రూ.780 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. బాలవుడ్ లో హయ్యెస్ట్ ప్రాపిట్ తీసుకొచ్చిన సినిమాల లిస్ట్ లో స్త్రీ2 టాప్ లో ఉండగా, హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్ స్త్రీ2 టాప్ 7లో ఉంది. దీన్ని బట్టి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆదరణ దక్కిందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటివరకు హిందీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డులు బాహుబలి2 మీద ఉండేవి. కానీ ఇప్పుడా ఆ రికార్డులను స్త్రీ2 రూ.585కోట్లు కలెక్ట్ చేసి సొంతం చేసుకుంది. అయితే ఈ రికార్డులను ఇప్పట్లో ఏ సినిమా అయినా బ్రేక్ చేస్తుందా అంటే అందరి చూపూ పుష్ప2 మీదే ఉంది. డిసెంబర్ 6న రానున్న పుష్ప2పై హిందీలో భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ బాగా కట్ చేసి ఉన్న అంచనాలను మరింత పెంచగలిగితే పుష్ప2 ఈ రికార్డులను బ్రేక్ చేసే ఛాన్సుందంటున్నారు. ముఖ్యంగా హిందీలో బి,సి సెంటర్ ఆడియన్స్ పుష్ప2 కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి స్త్రీ2 రికార్డులను పుష్ప2 బ్రేక్ చేస్తాడో లేదో తెలియాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే.